Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ప్రాచీన కళా ప్రక్రియలు నాటకం, సంగీతం, నత్యం కేవలం వినోద మాధ్యమాలు కాక శాస్త్రీయత ఉందని పర్యాటక సాంస్కతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో బుధవారం సంగీత నాటక అకాడమీ నిర్వహణలో తెలంగాణ నాటకం, సంగీతం, నత్యం సంపుటిల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిóగా శ్రీనివాస్‌గౌడ్ పాల్గ్గొని సెంపుటిలను ఆవిష్కరించి మాట్లాడారు. నాటకం గత కాలం నుంచి సమాజాన్ని చైతన్య పరిచే సాధనంగా ఉపయోగపడిందన్నారు. సంగీతం, నత్యం మానసిక, శారీరక ఆరోగ్యానికి సాధనాలన్నారు. మూడు సంపుటిలు ఉపయుక్తమని వివరించారు. అధ్యక్షత వహించిన అకాడమీ చైర్మెన్ బాద్మి శివకుమార్ గ్రంథాలలో పరిశోధనాత్మక వ్యాసాలు ప్రముఖులు రచించారని తెలిపారు. గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్ పేస్ట్ గ్రంధాలయంలో ఈ గ్రంథాలు అందుబాటులో ఉంచుతామన్నారు. అకాడమీ కార్యదర్శి వసుంధర, రంగస్థల ప్రముఖుడు కోట్ల హనుమంతరావు, సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ తదితరులు పాల్గొన్నారు.