Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
మాన్సురాబాద్ డివిజన్ పరిధిలోని జడ్జెస్ కాలనీ నుండి హిమపురి కాలనీ వరకు నూతనంగా నిర్మిస్తున్న వరదనీటి కాలువ ఓపెన్ డ్రైన్స్ పనులను బుధవారం ఎల్బీ నగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డిలు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే వర్షాకాలం దష్టిలో పెట్టుకుని పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎత్తుపల్లాలు సరిసమానంగా చూసుకుని వరదనీరు సమానంగా పోయే టట్టు చూసుకొని, రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయాలని సూచించారు. ఇట్టి పనులు పూర్తి అయితే చుట్టుపక్కల కాలనీవాసులకు వరదనీటి నుండి పూర్తి స్థాయిలో విముక్తి లభిస్తుంది అని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు, జగదీష్ యాదవ్, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.