Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
మహిళలకు శానిటేషన్ వసతులు కల్పించేందుకు జీహెచ్ఎంసీ నూతనంగా షీ టాయిలెట్స్ ఏర్పాటు చేసిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. బుధవారం గాజులరామారం డివిజన్ ఉషోదయాకాలనీ ప్రధాన రోడ్డులో, సూరారం డివిజన్ పరిధిలోని సూరారం బస్టాప్‌లలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షీ టాయిలెట్స్‌ను ఆయనతో పాటు కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, స్థానిక కార్పొరేటర్లు రావుల శేషగిరిరావు, మంత్రి సత్యనారాయణలు పాల్గొని ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాలలో టాయిలెట్స్ లేక మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారన్నారు. డ్వాక్రా మహిళలు చేసుకున్న దరఖాస్తు మేరకు జీహెచ్ఎంసీ వారు కేటాయించిన దుకాణాల ద్వారా వచ్చే ఆదాయంపై ఈ మరుగుదొడ్ల నిర్వహణ కొనసాగుతుందన్నారు. అనంతరం డ్వాక్రా మెంబర్ నారాయణమ్మకు షీ టాయిలెట్స్ నిర్వాహణ బాధ్యతను తీసుకోవడంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు రూ.50 వేలు వ్యక్తిగత రుణాన్ని మంజూరు చేయించి అందుకు సంబంధించిన పత్రాన్ని ఎమ్మెల్యే సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసి ప్రశాంతి, శానిటేషన్ డీఈ ప్రశాంతి, డిపిఓ హరిప్రియ, బ్యాంక్ ఆఫ్ ఇండియా సూరారం బ్రాంచ్ మేనేజర్ శాంతి, గాజులరామారం డివిజన్ అధ్యక్షులు విజరురామిరెడ్డి , నాయకులు మధుమోహన్, మన్నె బాలేష్, శ్రీనివాస్‌యాదవ్, నవాబ్, అబిద్, సింగారం మల్లేష్, మసూద్, ఇబ్రహీం, చెట్ల వెంకటేష్, సంధ్యారెడ్డి, నిర్వాహకురాలు నారాయణమ్మ, రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.