Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్/శామీర్‌పేట
సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డితో కలిసి కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో రూ.1.34 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేడు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. మేయర్ జక్కా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే మోడల్ కార్పొరేషన్‌గా పీర్జాదిగూడను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో పాల్గొని 44 మంది లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, కమిషనర్ ఎం.శ్రీనివాస్, తహసీల్దార్ ఎస్తేరు అనిత, డిప్యూటి మేయర్ కుర్ర శివకుమార్‌గౌడ్, కార్పొరేటర్లు కె.సుభాష్ నాయక్, కొల్తూరు మహేష్, బచ్చ రాజు, వీరమల్ల సుమలత, మద్ది యుగేందర్‌రెడ్డి, అమర్‌సింగ్, పాశం శశిరేఖ, బండారు మంజుల, కుర్ర షాలిని, భీంరెడ్డి నవీన్‌రెడ్డి, ఎన్.మధుసూదన్‌రెడ్డి, ఎంపల్ల అనంత్‌రెడ్డి, దొంతిరి హరిశంకర్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యులు బొడిగే రాందాస్‌గౌడ్, చిలుముల జగదీశ్వర్‌రెడ్డి, షేక్ ఇర్ఫాన్, పార్టీ నాయకులు పప్పుల అంజిరెడ్డి, మాడుగుల చంద్రారెడ్డి, యాసారం మహేష్, బొడిగే కృష్ణాగౌడ్, లేతాకుల రఘుపతిరెడ్డి, వీరమల్ల సత్యనారాయణ, తూముకుంట్ల శ్రీధర్‌రెడ్డి, పాశం బుచ్చి యాదవ్, బండారి రవీందర్, కుర్ర శ్రీకాంత్‌గౌడ్, అలువాల దేవేందర్‌గౌడ్, చెరుకు పెంటయ్యగౌడ్, జావిద్‌ఖాన్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
రాష్ట్ర సమడ్రిభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ మధుకర్ రెడ్డి, జడ్పీటీసీ అనిత, ఎంపీపీ ఎల్లుబారు వైస్ ఎంపీపీ సుజాత, అధికారులు, సర్పంచ్‌లు బాలమని, సరసం మోహన్ రెడ్డి, వనజ, సుజాత, భాస్కర్, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, మండల రైతుబంధు కమిటీ అధ్యక్షుడు కమటం కృష్ణారెడ్డి, సుదర్శన్ పాల్గొన్నారు.