Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు చేసిన వ్యాఖ్యలను ఓయూ విద్యార్థి జేఏసీ, టీఆర్ఎస్వీ నేతలు ఖండించారు. ఈమేరకు బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట బండి సంజరు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం విద్యార్థి నేతలు మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, ఆవిషయం మరిచి మతిలేకుండా మాట్లాడటం బండి సంజరుకు తగదన్నారు. ఇప్పటికైనా తన తీరు మార్చుకపోతే విద్యార్థిలోకం ఆగ్రహానికి గురి కాకతప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నేతలు, టీఆర్ఎస్వీ విద్యార్థులు తుంగ బాలు, బండారి వీరబాబు, మంద సురేష్, కడారి స్వామి, ఆలకుంట హరి, క్రాంతి కిరణ్, ఎర్రవాండ్ల కష్ణ, గధరాజు చందు, పడాల సతీష్, వెంకట్ గౌడ్, నవీన్ గౌడ్, దశరథ్, చాప భాస్కర్, పాండు గౌడ్, జంగయ్య, కాటం శివ, మేకల రవి, మబ్బు కరుణాకర్, షఫీ, నాగరాజ్ యాదవ్, ప్రశాంత్, సురేష్, మిథున్ తదితరులు పాల్గొన్నారు.