Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఎన్నికలు రాగానే ఏదో ఒక జిమ్మిక్కుతో ప్రజలను మభ్య పెడుతూ, లేనిపోని హామీలు ఇస్తూ ఉంటారని, తర్వాత అమలు ఏ చేయడంలో విఫలం అవుతారని సీఐటీయూ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం. చంద్రశేఖర్ అన్నారు. బాచుపల్లి వార్డు కార్యాలయం వద్ద బుధవారం ఆగస్టు 20 చలో హుజూరాబాద్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని సీఐటీయూ బాచుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ కార్యదర్శి ఎన్.ఎల్లమ్మ మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బందికి కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలని, సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగులను, కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. హుజూరాబాద్ మున్సిపల్ ఉద్యోగ కార్మికుల శంఖారావం జయప్రదం చేయాలని ఉద్యోగ కార్మికులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు నరసింహ, శ్రీను, జీతయ్య, లక్ష్మి, దుర్గయ్య, బాలయ్య, యశోద, పెంటమ్మ, ఎం.కృష్ణ, నరేష్, శ్రీను, జయమ్మ పాల్గొన్నారు.