Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఈనెల 25న చలో కలెక్టరేట్ పిలుపునిచ్చినట్లు సీపీఐ(ఎం) ఉప్పల్ కార్యదర్శి ఎర్రం శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉండే ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు పేదలకు మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోగా ఎన్నికలు వచ్చినప్పుడు హామీలను ఇస్తున్నారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మాయమాటలు చెప్తున్నారు కానీ పేదలకు ఇంతవరకు నిర్మాణం పూర్తి అయిన ఇండ్ల్లు కూడా ఇతరులకు ఇవ్వడం లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులను గుర్తించి ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే ఇవ్వాలని సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 25న జరుగు చలో కలెక్టరేట్ విజయవంతం చేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కార్యదర్శి ఎర్రం శ్రీనివాసులు, చలపతి, నారాయణ, శ్రీనివాస్ సైదులు, వెంకన్న, నాయుడు పాల్గొన్నారు.