Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
వినాయక నగర్ డివిజన్ పరిధిలోని చంద్రగిరి కాలనీలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రయినేజీ పనులను గురువారం స్థానిక కార్పొరేటర్ క్యనం రాజ్యలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పనులను నాణ్యతగా చేపడుతూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు, బీజేపీ డివిజన్ అధ్యక్షులు ఓం. ప్రకాష్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, రాకేష్ యాదవ్, సర్వేశ్ యాదవ్, సోమనాథ్ చారి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.