Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
సీపీఐ ఎంఎల్ రామచంద్రన్ సెంట్రల్ కమిటీ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ ఆఫీసులో డీసీపీ సన్ ప్రీత్‌సింగ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లాకు చెందిన కొడుమూరి శ్రీనివాస్, జనార్దన్‌రెడ్డి, భాస్కర్ (గతంలో వీరిపై కృష్ణా జిల్లాలో ఐదు కేసులు నమోదై ఉన్నాయి) ఆత్మ కూర్ మండలం, సూర్యా పేట జిల్లా కు చెందిన అల్లుట్ల ఉప్పలయ్య, ఉపేందర్, (సూర్యాపేట పోలీస్ స్టేషన్లో 2 కేసులు, చైతన్యపురి పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఉన్నాయి) పెద్ద బిల్డర్లను, వ్యాపారస్తులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు అందడంతో నిఘా వేసిన చైతన్యపురి పోలీసులు కొత్త పేట, మోహన్‌నగర్ చౌరస్తావద్ద నలుగురిని అరెస్టు చేశారు. వీరి ద్వారా ఇంకెవరైనా మోసపోయి ఉంటే రాచకొండ పోలీసుల్ని సంప్రదించ వచ్చని, వారిపేర్లు గోప్యంగా ఉంచుతామని డీసీపీ తెలిపారు. వసూళ్లకు పాల్పడిన నిందితుల్లో ప్రస్తుతం ఓ నిందితుడు వెంకన్న పరారీలో ఉన్నాడు. సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, చైతన్య పురి ఇన్స్పెక్టర్ రవి కుమార్, డీఐ కష్ణ పాల్గొన్నారు.