Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సుమధుర, వాసవి గ్రూప్ సంయుక్తంగా అత్యంత పొడవైన రెసిడెన్సియల్ టవర్స్ ది ఓలంపస్ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు సుమధుర గ్రూప్ చైర్మెన్ ఎండీ జి మధుసూదన్ తెలిపారు. గురువారం బంజారాహిల్స్ హయత్ ప్యాలెస్ హోటల్లో ఇరు గ్రూప్ సంస్థల ప్రతినిధులు ద ఒలింపస్ పేరుతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. గచ్చిబౌలి ఫైనాన్స్ డిస్ట్రిక్‌లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈప్రాజెక్ట్‌ను వాసవి, సుమధుర గ్రూప్‌లు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.హైదరాబాద్‌లోనే అత్యంత పొడవైన టవర్లుగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందని సూచించారు. 854 లగ్జరీ మూడు పడకల, ఐదు పడకల గదులను నిర్మిస్తున్నామన్నారు. 50 వేల చదరపు అడుగుల క్లబ్ హౌస్, వర్కింగ్ స్పేస్, కేఫ్, లైబ్రరీ, స్విమ్మింగ్ ఫూల్, గెస్ట్ సూట్స్, ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్, బీబీక్యూ రెస్టారెంట్, స్పా లాంటి ఎన్నో వసతులతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌ను 2025 కల్లా పూర్తి చేస్తామని మధుసూదన్ తెలిపారు.