Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మలక్పేట్
సూర్యాపేట జిల్లా, నూతనకల్ మండలం, చిల్వకుంట్ల గ్రామానికి చెందిన పంతం నాగయ్య, అలివేలుల కూతురు అనూష-లింగయ్య ల వివాహం సందర్భంగా ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివద్ధి సంస్థ చైర్మెన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మెన్ ఉప్పల ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా మంగళసూత్రం, మెట్టెలు, చీరె, గాజులు అందచేశారు. శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ పెళ్లి కానుకగా వందలాది నిరుపేద కుటుంబాలకు సహాయం అందచేయడం జరిగింది అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మందికి సేవ చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూదిమెట్ల బాలరాజు యాదవ్, పెళ్లి కూతురు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.