Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర శివారులో దొంగల భయం
నవతెలంగాణ-హైదరాబాద్
హుండీిని ఎత్తుకెళ్ళి దొంగతనానికి పాల్పడిన ఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్లాపూర్మెట్ మండలం, కవాడిపల్లి గ్రామంలోని శ్రీ కోదండ రామ స్వామి గుడిలో ఈనెల 22న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అష్టలక్ష్మి ఆలయం వెనక ఉన్న గ్రిల్స్ తాళం పగులగొట్టి లోపలికి చొరబడి హుండీని ఎత్హుకెళ్లారు. అక్కడి నుంచి హుండీని ఎత్తుకెళ్లిన దుండగులు గుడి వెనక భాగంలో హుండీని పగల గొట్టగా అందులో సుమారుగా మూడు వేల రూపాయలు ఉన్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు. గుడి ఈఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.