Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో 17 చెరువుల్లో భూ ఆక్రమణలు, నిర్మాణాలు జరుగుతున్నాయని, ఇంకా కబ్జాలు కొనసాగుతున్నాయని తగిన చర్యలు తీసుకుని చెరువులను కాపాడాలని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు ఆకుల సతీష్ తెలిపారు. ఈ మేరకు ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. నిజాంపేట్ ప్రధాన నాలాను ఆక్రమించిన బిల్డర్‌పై చర్య తీసుకోవాలని కోరారు. అంత రెడ్డి కుంట, చంద్రన్న కుంటలను ఆక్రమణ కాకుండా కాపాడాలని,చెరువుల పరిరక్షణక ఎఫ్టిఎల్ పాయింట్స్‌ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాచుపల్లి మండల పరిధిలో 22 చెరువులకుగాను 17 చెరువుల్లో ఆక్రమణలు ఉన్నాయని గుర్తు చేశారు. కబ్జాలకు పాల్పడుతున్నవారిపై, వారికి సహకరిస్తున్నవారిపై క్రమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ సెక్రెటరీ అరుణ్ రావు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మదన్ గౌడ్, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ పాల్గొన్నారు.