Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీనగర్
ముషీరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అబ్రార్ హుస్సేన్ ఆజాద్ బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మంద ప్రభాకర్ సమక్షంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనేక త్యాగాలు చేశారన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అణగారిన వర్గాలకు మేలు జరగలేదని విమర్శించారు. తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజలు రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ వాదీ పార్టీకి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నంద కుమార్, కె.ఎల్. సత్య నారాయణ, ఐజాక్ నిషాన్, అహ్మద్, రవి, నరసింహ, సాయి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.