Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
నేత్రదానంతో మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని బంజారాహిల్స్ ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ మెడికల్ డైరెక్టర్, డాక్టర్ సునీత చురేసియా అన్నారు. ఈసందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతిఏటా 2 కోట్ల పైగా భారతీయులు కార్నియా అంధత్వనికి లోనయ్యారన్నారు. అందులో 60% మంది 12 ఏళ్లలోపువారే ఉన్నారని పేర్కొన్నారు. కార్నియా వ్యాధి అనేది గాయం లేదా ఇన్ఫెక్షన్ కారణంగా కలుగవచ్చని తెలిపారు. ఒక కార్నియా అంధత్వం ఉన్న వ్యక్తి చూపును పునరుద్ధరించడంలో కేవలం మరణించిన వ్యక్తి నేత్రదానం మాత్రమే సహాయపడగలదని చెప్పారు. ప్రజలు తమ కళ్లను దానంచేయకపోవడానికి కారణం అపోహ, అవగాహనలేమియే ముఖ్య కారణమన్నారు. భారతదేశంలో ప్రస్తుత కార్నియా సేకరణ, మార్పిడి శస్త్రచికిత్స అవసరమైన రోగులలో కేవలం నాలుగింట ఒకవంతుమందికి మాత్రమే జరుగుతుందన్నారు. ఉత్తమ పద్ధతులను అనుసరిస్తే కోవిడ్ సమయంలోనూ నేత్ర దానం సురక్షితమే అన్నారు. మరణానంతరం ఏ వయస్సువారైనా తమ నేత్రాలను దానం చేయవచ్చు, కాకపోతే మధుమేహం, ఉబ్బసం, అధిక రక్తపోటు, కళ్ళద్దాలు పెట్టుకునేవారికి అదనంగా శుక్ల శస్త్రచికిత్స జరిగినవారు కూడా నేత్రదానం చేయవచ్చు. ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదాన వారోత్సవ దినాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎల్వీపీఈఐ-నేత్రదాన హెల్ప్ లైన్ : 040-6810 2514/ 9849545822 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.