Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
బంజారాహిల్స్, వెంకటేశ్వర కాలనీ డివిజన్ల పరిధిలో దాదాపు 33 బస్తీలుండగా అందులో 8 బస్తీలు లోతట్టు ప్రాంతంలోనే ఉన్నాయి. వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలో నాయుడు నగర్, సింగడ కుంట, దేవరకొండ బస్తీ, గందిపురా బస్తీ,వెంకటేశ్వర కాలనీ, పాతది కొత్తది, నూర్ నగర్, జహీరా నగర్, బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో ఎన్బిటీ నగర్, ఎన్ బి నగర్, అంబేద్కర్ నగర్, ఉదరు నగర్, బస్తీలు అధిక వర్షం వస్తే ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాలాలపై అక్రమ కట్టడాలవల్ల భారీగా మట్టి డ్రయినేజీల్లో కూరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో నీరు రోడ్లపై ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల్లోకి చేరుతుంటుంది. సోమవారం కురిసిన కుండపోత వర్షానికి జూబ్లీ చెక్ పోస్టు నుంచి ఎల్వీ ప్రసాద్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి కేబీఆర్ పార్కు వరకు, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 నుంచి పంజాగుట్ట ఫ్లైఓవర్ వరకు రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ ట్రాఫిక్ సిబ్బంది, మాన్సూన్ టీమ్ రంగంలోకి దిగాయి. వాహన దారుల ఇబ్బందులు నివారించేందుకు కృషి చేశాయి.