Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
మన్సూరాబాద్‌లో ఉన్న సర్కార్ భూమిలో నిర్మాణాలు చేపడుతున్నట్లు సమాచారం అందుకున్న సరూర్‌నగర్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ యాదయ్య ఆధ్వర్యంలో అట్టి నిర్మాణాలను పోలీసుల సహాయంతో కూల్చివేశారు. మన్సురాబాద్ వీకర్ సెక్షన్ కాలనీ సర్వే నెంబర్ 1లో రెవిన్యూ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవన్నారు. రెవిన్యూ అధికారులు కొందరు చెప్పిన మాటలు విని కేవలం కొందరికి కొమ్ముకాస్తున్నారని, మా ప్రాంతంలో దాదాపు 10చోట్ల నిర్మాణాలు చేపట్టినా కూడా తన ఇంటిని మాత్రమే కూల్చడం వెనుక ఆంతర్యం ఏమిటి అని, బాధిత మహిళ పల్లె సునీత అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్వే నెంబర్ 1లో దాదాపు 10చోట్ల నిర్మాణాలు జరుగుతున్నా వారి కళ్ళకు కనిపించడం లేదా, అని ఆమె ప్రశ్నించారు. గతంలో కూల్చివేసి, మరల వచ్చి పూర్తి స్థాయిలో నేల మట్టం చేశారని, ఎల్బీనగర్లో రాజకీయ నాయకుల్లా మేము కబ్జా చేసి నిర్మాణాలు చేయడం లేదని, కొనుగోలు చేసిన భూమిలో నిర్మాణాలు చేస్తే అడ్డుకోవడం ఏంటని కూల్చివేస్తే జేసీబీ కింద పడి చనిపోవడానికి యత్నించగా పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పంపివేశారు.
2008లో రెవిన్యూ, మున్సిపల్ అధికారులకు కబ్జాలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటికి చర్యలు లేవని ఫిిర్యాదు దారుడు వెంకులు యాదవ్ అన్నారు. చూడాలి మరి అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోతారో, లేక అందరిపై సమానంగా చర్యలు తీసుకుంటారో.