Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి లైఫ్ సపోర్ట్ మీద ఉండి, కొవిడ్-19 కూడా ఉన్న బాధితుడి ప్రాణాలను అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రి (ఎల్బీనగర్) వైద్యులు కాపాడారు. ఈ కేసు సంక్లిష్టత గురించి చికిత్స విధానం మొత్తానికి నేతత్వం వహించిన అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలోని కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ''ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి ఆ కుర్రాడు కోమా పరిస్థితిలో ఉన్నాడు. అతడి వైటల్స్ అన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. దాంతో బతికే అవకాశాలు చాలా సన్నగిల్లిపోయాయి. అయితే, వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు, తాను కలిసి ఆశ వదులుకోకుండా కొన్ని రోజుల పాటు బాగా ప్రయత్నించి, అతడు కోలుకునేలా చేయగలిగాం అని తెలిపారు. చికిత్స విధానంలో భాగంగా చేసిన పరీక్షల్లో కొవిడ్-19 అని తేలి, రోగి పరిస్థితి మరింత విషమం అయ్యింది. వైరస్ లోడ్ చాలా ఎక్కువగా ఉంది. ఒకవైపు విరిగిన ఎముకలకు చికిత్స, మరోవైపు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్కు చికిత్స రెండు చేస్తూ అతడు పూర్తిగా కోలుకునేలా చూడాల్సి వచ్చింది. పూర్తగా కోలుకున్నాక రోగిని జులై 24వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశాము. ఇటీవలే అతడిని మరోసారి ఆసుపత్రిలో పూర్తిగా పరీక్షించాము. ఇప్పుడు రోజువారీ పనులన్నీ చేసుకుంటు న్నాడని అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలోని కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ గౌరీశంకర్ తెలిపారు. హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతంలోని అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి భారతదేశంలోని టెర్షియరీ కేర్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యుత్తమమైనది. ఈ ఆసుపత్రికి అన్ని ప్రధాన ఆరోగ్యబీమా సంస్థలతో ఒప్పందం ఉంది, హైదరాబాద్‌లోని అన్ని కార్పొరేట్ సంస్థలలో ఎంప్యానల్ అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్‌కేర్ ప్రొవైడర్ అయిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌లో గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి ఒక భాగం. అన్ని విభాగాలలో పూర్తిస్థాయి సేవలు, నిబద్ధత కలిగిన సిబ్బంది, అందరికీ అందుబాటులో ఉండటం, నాణ్యతకు, భద్రతకు కట్టుబడి ఉండటంతో ఐహెచ్‌హెచ్ ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన హెల్త్‌కేర్ సర్వీసుగా నిలిచింది