Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
గహకార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ (+ఖుూ), అధ్వర్యంలో మోంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ నందు నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ ఉమ్మన దేవేందర్ రెడ్డి, పి.వి.రమణమూర్తి, సహాయ కార్మిక అధికారి ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఈ సంద్భంగా కార్మిక సక్షేమ మండలి చైర్మెన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'ఈ-శ్రామ్' పోర్టల్‌లో అసంఘటిత కార్మికుల నమోదుపై అవగాహన కల్పించారు. హైదరాబాద్ మరియు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని 36 మురికివాడల నుండి విచ్చేసిన రెండు వందలకుపైగా వచ్చిన యూనియన్ నాయకులు, కార్మికులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిచయం చేశారు. ఆగస్టు 26న ప్రారంభమయ్యే ఈ కొత్త పోర్టల్ ద్వారా కార్మికులందరూ కార్మిక సంక్షేమ బోర్డు కింద నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పి.వి.రమణమూర్తి కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియపై నాయకులు, కార్మికుల సందేహాలను నివత్తి చేసారు. (+ఖుూ) రాష్ట్ర సమన్వయకర్త సిస్టర్ జెనేస్టస్, (+ఖుూ) ఫీల్డ్ కోఆర్డినేటర్ వల్లాల మంజుల ఈ సమావేశాన్ని నిర్వహించారు. మాంట్‌ఫోర్ట్ సోషల్ ఇనిస్టిట్యూట్ హౌసింగ్ రైట్స్ నెట్‌వర్క్‌కు చెందిన సైమన్‌రాజ్ పసాలా, హైమా అన్నెబోయిన, ఇండియా లేబర్లైన్ రాష్ట్ర కోఆర్డినేటర్ అంజిరెడ్డి హాజరయ్యారు.