Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ-శామీర్ పేట/మూడు చింతలపల్లి
దళిత, గిరిజన ఆత్మగౌరవ సభల పేరిట టీపీసీసీ రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ జహంగీర్ మండిపడ్డారు. బుధవారం మూడుచింతలపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ మూడు చింతలపల్లి మండలంలోని దత్తత గ్రామాల్లో అభివృద్ధిపై ఇంటింటికి తిరిగి సర్వే చేద్దామని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరామని, మధ్యాహ్నం రెండు గంటలైనా ఆయన రాలేదని అని ఎద్దేవా చేశారు. డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ మధుకర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరంగా మాట్లాడితే ఖబర్దార్ అని రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, మురళీగౌడ్, విష్ణుగౌడ్, రవీందర్ రెడ్డి, సర్పంచ్లుసింగం ఆంజనేయులు, రామచంద్రయ్య, గోపినాయక్, సొసైటీ డైరెక్టర్లు భవ్‌సింగ్, నర్సింహ, నాయకులు చిత్తయ్య గౌడ్, నర్సింగ రావు, శ్రీకాంత్ రెడ్డి, గోపాల్ పాల్గొన్నారు.