Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్‌పేట
డ్రయినేజీ పైపులైన్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. బుధవారం గోల్నాక డివిజన్ శాంతినగర్‌లో రూ.7 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న డ్రయినేజీ పైప్‌లైన్ నిర్మాణ పనులను కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రయినేజీ సమస్యల నివారణకు నూతన పైపులైన్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. పైపులైన్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని అన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏఇ రోహిత్, వర్క్ ఇన్స్పెక్టర్ అక్ష్వాక్, కాంట్రాక్టర్ నాగరాజు, నాయకులు భూపతి లక్ష్మణ్, రేడపాక రాము, ఆర్.కె.బాబు, కట్టెల సతీష్ కుమార్, సతీష్, అనిల్, బిక్షపతి, లింగంగౌడ్, బుచ్చిరెడ్డి, నర్సింగ్ యాదవ్, అబ్బు, ప్రభాకర్, చారి, ఉమేష్, మల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.