Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
మూడు చింతలపల్లిలో కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష నేపథ్యంలో రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలు, రాజీనామా సవాల్, ప్రతి స్పందనగా మేడ్చల్ ఎమ్మెల్యే, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు, రాజీనామా సవాల్ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోను, జిల్లాలోను రాజకీయ దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నడుమ అగ్గిరాజేస్తున్నాయి. ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు పోటా పోటీగా గురువారం దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీవారు మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను, టీఆర్ఎస్ పార్టీవారు కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను ఆయాచోట్ల దహనం చేసి వ్యతిరేక నినాదాలు, విమర్శలు చేసుకున్నారు. మల్లారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్ స్పందించగా మరోసారి మల్లారెడ్డి కూడా స్పందించారు.
సీఎం దత్తత గ్రామమైన మూడుచింతలపల్లి వేదికగా రెండురోజులపాటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలు జరిగాయి. రేవంత్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ పాల్గొన్న సంగతి తెలిసిందే. దీక్షలు ముగింపు సందర్భంగా బుధవారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం దత్తత గ్రామాల్లో ఏం అభివృద్ధి జరిగిందని? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి ఎక్కడ అమలు చేశారని? ప్రశ్నించారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు నిరూపిస్తే మూడుచింతలపల్లి చౌరస్తాలో ముక్కు నేలకు రాసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. దీనికి కౌంటర్‌గా అదేరోజు మంత్రి మల్లారెడ్డి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డిని గూట్లే అని సంబోధిస్తూ, తిడుతూ.. తొడగొడుతూ తాను రాజీనామాకు సిద్ధమని, రేవంత్‌రెడ్డి కూడా రాజీనామా చేయాలని అన్నారు. '' నీ ఎంపీ పదవికి రాజీనామా చేయి...నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా'' అని సవాల్ చేశారు. దీంతో రేవంత్‌పై మల్లారెడ్డి చేసిన వాఖ్యలకు నిరసనగా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులు అన్ని ప్రధాన కేంద్రాలలో గురువారం మంత్రి మల్లారెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశాయి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టి మల్లారెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కో ఆర్డీనేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి తన స్థాయికి మించి వ్యాఖ్యలు చేశారని, రాజకీయాలలో ఇంత దిగజారి మాట్లాడటం ఆయనకే చెల్లిందని అన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం దత్తత గ్రామాల్లో అభివద్ధి గురించి మాట్లాడితే.. సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి ఎదురు దాడి చేసేలా మాట్లాడడం సరైంది కాదన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా మల్లారెడ్డి దిష్టి బొమ్మలు దహనం చేస్తామని, మంత్రి మల్లారెడ్డి కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ పోగుల నరసింహ రెడ్డి, కార్పొరేటర్లు తోటకూర అజరు యాదవ్, బొమ్మకు కల్యాణ్, సీనియర్ నాయకులు కొత్త ప్రభాకర్‌గౌడ్, ఎలగోని బాల రాజ్ గౌడ్, కొత్త కిషోర్ గౌడ్, కత్తి వెంకట్‌రెడ్డి, చింతల శ్రీనివాస్ రెడ్డి, ఫకీర్ హరినాథ్ రెడ్డి, పొన్నం తరుణ్ గౌడ్, చీరాల జంగయ్య, గందే విశ్వం, రాపోలు ఉపేందర్, రామగళ్ల చంటి, తోటకూర రాహుల్ యాదవ్, పీర్జాదిగూడ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, మాజీ అధ్యక్షుడు వంగేటి ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, పన్నాల శ్రీనివాస్, రాళ్లబండి రమేశ్, కౌడే కుమార్ పాల్గొన్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న మేడిపల్లి పోలీసులు వ్యక్తిగత పూచీ కత్తుపై వదిలిపెట్టారు.
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో..
పైరవీల ద్వారా పదవులు తెచ్చుకుని మంత్రి మల్లారెడ్డిపై అవాకులు చెవాకులు పేలుతున్న రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని బోడుప్పల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి హెచ్చరించారు. గురువారం మల్లారెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర నాయకులు చేసిన వాఖ్యలను నిరసిస్తూ బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహంవద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, బొమ్మ దహనం చేశారు. అనంతరం సంజీవరెడ్డి, మేయర్ సామల బుచ్చిరెడ్డిలు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రాజకీయ బ్రోకర్ అని, బ్లాక్ మెయిల్ రాజకీయాలతో పబ్బం గడుపుకునే రేవంత్ రెడ్డికి మల్లారెడ్డిని విమర్శించే అర్హతలేదని అన్నారు. కార్యక్రమంలో బోడుప్పల్ కార్పొరేటర్లు కొత్త చందర్‌గౌడ్, బింగి జంగయ్య యాదవ్, చీరాల నరసింహ, సుమన్ నాయక్, కో ఆప్షన్ సభ్యులు రంగ బ్రహ్మన్న గౌడ్, దత్తాత్రేయ శర్మ, జ్ఞానదేవ్ ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు కాటపల్లి రాంచంద్రారెడ్డి, మీసాల కష్ణా, కపాసాగర్, జె.రాములు, గుర్రాల వెంకటేష్ యాదవ్, బందరపు శ్రీధర్‌గౌడ్, బొమ్మకు బాలయ్య, మోదుగు శేఖర్‌రెడ్డి, బొమ్మకు విశ్వనాథ్, పీవీ సురేష్, రవి ముదిరాజ్, మైసగళ్ల జానీకుమార్, పుల్లూరి విష్ణు వర్దన్రావు, కాటం రాజిరెడ్డి, బోడగళ్ల సదానంద్, ఉప్పరి విజరు, కీర్తన్ రెడ్డి, చిల్ల రమేష్, మైసగళ్ల బాబా, మోతే రాజు, సామల మనోహర్ రెడ్డి, జె.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.