Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి ఓర్సు రాములు
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన సవాలును స్వీకరించి దమ్ముంటే పీసీసీ అధ్యక్ష పదవికి, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి ఓర్సు రాములు డిమాండ్ చేశారు. రాజకీయాలకు రాకముందు నుంచే ఆస్తులు ఉన్నాయని, అలాగే విద్యాసంస్థల్లో భవనాలు అన్నింటిని సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు తీసుకున్నారని, మల్లారెడ్డి విద్యా సంస్థలు ఎలాంటి అక్రమాలు లేవని పార్లమెంట్లో కేంద్రమే ప్రకటించిందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం అభివద్ధిలో ముందంజలో ఉందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో మర్రి రాజశేఖర్రెడ్డి కార్మికులకు భోజన వసతి కల్పించి వారికి అండగా ఉన్నారన్నారు. అభివద్ధి పనులు చూసి మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి పైన వస్తున్న పేరు ప్రఖ్యాతులను ఓర్వలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంపీ రేవంత్ రెడ్డి తీరు మార్చుకోకుంటే అడుగడుగున కార్మికుల నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.