Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రెండేండ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, సర్కార్ బడుల్లో మౌలిక వసతుల కల్పించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) నాయకులు గురువారం హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లును కలిసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.పరశురాం, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు రియాజ్, పి.నాగరాజు మాట్లాడారు. సిటీలోని 861 గవర్నమెంట్ స్కూళ్లల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, స్టూడెంట్లకు పాఠ్య పుస్తకాలు అందజే యాలని కోరారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రయివేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకో వాలని, చార్మినార్ మండలంలోని సుల్తాన్ షాహీ ఉన్నత పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని, ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలకు మరమ్మతులు చేపట్టాలని వారు కోరారు. కార్యక్రమంలో పీడీఎస్యూ ఉపాధ్యక్షులు కె.గణేష్, ఎం.నవీన్ పాల్గొన్నారు.