Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
వర్షాలతో ఏర్పడ్డ నాలా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్ అధికారులను కోరారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో పాదయాత్ర చేశారు. ఈసందర్భంగా స్ధానికులు వర్షాలకు నాలాలు నిండి నీరు ఇండ్లలోకి చేరుతుందని కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులను పిలిపించి నాలాలను శుభ్రం చేపించి డ్రయినేజీ నీరు సాఫీగా వెళ్లేలా చేశారు కార్యక్రమంలో జీహచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మహమ్మద్ మోసిన్, రంగు ఉదరుగౌడ్, వంజరి నాగరాజు, రాజ్‌కుమార్, హైమత్, సంతోష్‌చారి పాల్గొన్నారు.