Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్, ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్‌ను మేజర్ ధ్యాన్ చంద్-2021 అవార్డుకు ఎంపిక చేసినట్లు కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్, కస్తూర్బా గాంధీ మహిళా డిగ్రీ, పీజీ, ఎన్సీసీ స్పోర్ట్స్ అధికారి మేజర్ డి.జయసుధ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29న జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్, కస్తూర్బా గాంధీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మారేడిపల్లిలోని కళాశాలలో ఆయకు ఈఅవార్డును అందజేయనున్నట్లు చెప్పారు. ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌గా, ఓయూ డీన్‌గా, ఫ్యాకల్టీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ గా ఎన్నో పదవులు చేపట్టి రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివద్ధి చేసి, యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారన్నారు. జేఎన్టీయూ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల హెడ్ కోచ్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ డాక్టర్ ఎగినె జార్జ్, డాక్టర్ ఆర్.జయశ్రీ ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఇటీవల బాక్సింగ్, రన్నింగ్, అథ్లెటిక్స్‌లో గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు.