Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-సరూర్‌నగర్
దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తోందని, వాటిని టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అర్హులకు అందే విధంగా కృషిచేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్కేపురం డివిజన్లో నిర్వహించిన టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పెండ్యాల నగేష్‌ను నియమించి, నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరంతరం రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారని, అలాంటి మహోన్నత నేతకు ప్రజలు మద్దతు ఇవాల్సిన అవసరముందన్నారు. నగేష్ మాట్లాడుతూ డివిజన్లో సీనియర్, పాత, కొత్త నాయకులను కలుపుకొనిపోయి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ శ్రీధర్, డివిజన్ మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల ఆరవింద్ శర్మ, ఆలయ చైర్మెన్లు శ్రీనివాస్, జగిని రమేష్ గుప్త, కొండ్ర శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, బీరెల్లి వెంకట్ రెడ్డి సాజిద్, లింగస్వామి గౌడ్, జహీద్, వాహేద్ పటేల్, బాలుశ్రీ, జగన్, నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ సునీత రెడ్డి, లిక్కి ఊర్మిళ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.