Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సికింద్రాబాద్లోని బొల్లారం రిక్రియేషన్ క్లబ్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బొల్లారంలోని ఇంటింటికి వెళ్లి అక్కడి స్ధానికులను వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అని ఆరా తీశారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు తమ ఇంటిముందు స్టిక్కర్లు అంటించింది లేనిది స్వయంగా పరిశీలించారు. స్టిక్కర్ లేని ఇండ్లకు వెళ్లి వ్యాక్సిన్ ఎందుకు తీసుకులేదో తెలుసుకుని..తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో ఇంటింటి సర్వేను పూర్తి చేశామని, వ్యాక్సిన్ తీసుకుని వారిని గుర్తించి టీకా వేసుకునేలా మోటివేట్ చేశామని అధికారులు కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్. వెంకట్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.