Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా సెంక్వేవ్, థర్డ్ వేవ్ పేర్లతో స్కూల్స్, కాలేజీలు మూసి వేయడంతో ఆన్లైన్ గేమ్‌లు జోరందుకున్నాయి. ఆన్లైన్ చదువులేమోగానీ ఏ ఇంట్లో చూసినా పిల్లల నుంచి యువకుల వరకు ఆన్లైన్ గేమింగ్తోనే కాలం గడిపేస్తున్నారు. గతంలో బ్లూవేల్ ఛాలెంజ్... పోకెమాన్‌గో... టెంపుల్ రన్... పబ్జీ... ఆడేవారు తాజాగా ఫ్రీ ఫైర్, సబ్ వే సర్ఫేస్ వంటి ఆన్లైన్ గేమ్‌లు పిల్లలను, యువతరాన్ని వెర్రివాళ్లను చేస్తోంది. వారికి తెలియకుండానే గంటల తరబడి అందులో విలీనమవుతున్నారు. ఇది కొందరు ప్రాణాల మీదికోస్తోది. ఈ గేమ్స్‌కు అలవాటు పడిన యువత అందులో నుంచి బయటకు రాలేకపోతోంది. చిన్నా పెద్దా అనే తేడాలేకుండా బానిసలుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో కొందరు నేరాలకు పాల్పడుతుంటే మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దాంతో తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు.
అక్కడ ఇక్కడని లేదు..
చేతిలో ఫోన్ ఉంటే చాలు ఆన్ లైన్ గేమింగ్‌లోనే పిల్లలు లీనమైపోతున్నారు. చదువును పక్కన పడేసి సెల్ఫోన్లో సినిమాలు, జోక్స్తోపాటు అధికంగా ఆన్లైన్ గేమ్‌లు ఆడేస్తున్నారు. ఏ పిల్లాడిని, ఏ యువతీయువకులను చూసినా ఆన్లైన్ గేమ్స్ ఆడేస్తున్నారు. ఇప్పుడు యూత్‌కు ఓ వ్యసనంలా మారాయి. ఇంట్లో, ఆరుబైటా, భవంతీలు, రోడ్లు, ఖాలీ స్తలాలు, దుకాణాల ముందు ఇలా అక్కడ ఇక్కడా ఇక్కడ అని లేకుండా గల్లీగల్లీలో గంటల తరబడి సెల్ఫోన్లతో గేమ్‌లు ఆడేస్తున్నారు. డ్రగ్స్కంటే కూడా భయంకరంగా అడిక్ట్ అవుతున్నారు. ఇతరులతో పనిలేకుండా వారికివారే నవ్వుకుంటూ గేమ్స్‌లను ఆడుతున్నారు.
తెల్లారేవరకు మృత్యు క్రీడల్లోనే
టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది దాని వల్ల ప్రయోజనాలు ఎంతో కానీ అవాంతరాలు మాత్రం విపరీతంగా వచ్చి పడుతున్నాయి. గతంలో బ్లూవేల్ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. 50 రోజుల టాస్క్‌లో ప్రతిరోజూ రోజుకో టాస్క్‌తో టీనేజర్ల భావోద్వేగాలతో ఆడుకుంది. రిజిస్ట్రేషన్ చేసుకుని ఆడడం ప్రారంభించాక, తొలుత చిన్న చిన్న టాస్క్‌లతో ప్రారంభించి వాటి తాలూకు ఫొటోలను షేర్ చేయాలని కోరే వారు. అలా ఒకటీ రెండు రోజులు అలవాటయ్యాక, గేమ్ స్థానంలో మెంటర్ అందుబాటులోకి వస్తాడు. అప్పటినుంచి మృత్యు క్రీడ ప్రారంభమవుతుంది. ఈ గేమ్‌లో పిల్లలు తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ ఉండేవారు. గేమ్‌లో చెప్పిన విధంగా చర్మంపై కత్తికానీ, ఇతర పదునైన వస్తువులతో కానీ బొమ్మలను, ఆకారాలను గీసి, దానికి సంబంధించిన ఆధారాలు ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తుండే వారు. ఈ తరహాలో టాస్క్ పెరుగుతున్నాకొద్దీ వాటి తీవ్రత పెరుగుతుండేది. ప్రాణాలు తీసుకునే వారు. కొన్నాళ్లపాటు హల్చల్ చేసిన ఈ గేమ్ తరహాలో మోమో గేమ్ తెరపైకి వచ్చాయి. హర్రర్ మూవీని తలపించిన ఈ ఆట పిల్లల ప్రాణాలను తీసింది. ఆ తర్వాత పబ్జీ, ప్రీ ఫైర్ గేమ్స్ వచ్చాయి. ఈ గేమ్స్ యువతను బాగా ఆకర్షిస్తున్నాయి.
దొంగా పోలీస్ యాడికి పోయే..
పూర్వకాలంలో పిల్లలు అమ్మానానా, దొంగా పోలీస్ అంటే ఎంతో ఇష్టాంగా ఆడేవారు. అయితే కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత కార్ రేసింగ్‌లు, డేవ్, చెస్, క్రికెట్ లాంటి కంప్యూటర్ గేమ్స్, లేదా 3డీ గేమ్స్‌కు అలవాటు పడ్డారు. ఇక సెల్ఫోన్లు వచ్చిన అనంతరం ఆన్లైన్ గేమ్స్‌కు బాగా క్రేజీ పెరిగింది. యుద్ధంలా సాగే ఈ క్రీడలో గాయపడితే మెడికల్ కిట్లు, బంకర్ సదుపాయాలు కూడా ఉంటాయి. అత్యాధునిక ఆయుధాలతో ఎదుటి వాడిని చంపేసే గేమ్ కావడంతో గేమ్ మొదలైనప్పటి నుంచి ఒక రకమైన ఉన్మాదంలో మునిగి తేలుతున్నారు. దాంతో యువతకు ఇది ఒక వ్యసనంగా మారుతుంది. దాంతో పిల్లల చదువులు అటకెక్కుతున్నాయి. దీనికి తోడు ఆన్లైన్, ఆఫ్‌లైన్ గేమ్‌లతో హింస అనార్థలు పెరుగుతున్నాయి.
ఆప్యాయతలకు ఆమడ దూరంలో పిల్లలు
పూర్వం ఉమ్మడి కుటుంబాలుండేవి. దాంతో ఇంట్లో పెద్దలు ఉండే వారు. దాంతో పిల్లలకు ఏది మంచి ఏది చెడో చెప్పేవారు. అయితే హైటెక్ యుగంలో డబ్బుల సంపాదనలో పడి అందరూ దాని వెనుకాలే పరుగులు పెడుతున్నారు. దాంతో ఉమ్మడి కుటుంబాల స్థానంలో వ్యక్తిగత జీవితాలకు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో బంధాలకు, అనురాగాలకు పిల్లలు దూరంగా జీవించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. పనిఒత్తిడి కారణంగా తల్లిదండ్రులకు క్షణం తీరిక లేకపోవడంతో పిల్లలను దూరంగా పెడుతున్నారు. వారికి ఏది కావాలంటే అది అందిస్తున్నారే తప్పా, వారేం చేస్తున్నారు, ఏవరితో స్నేహంగా ఉంటున్నారో అనే విషయాలను గమనించడం లేదు. రోజురోజుకు తల్లిదండ్రుల ప్రేమకు దూరమవుతున్న పిల్లలు విడియో గేమ్స్, ఆన్లైన్ గేమ్స్‌కు ఆకర్శితులవుతున్నారు. అదే లోకంగా జీవిస్తున్నారు. వారికి మంచిచెడ్డలు చెప్పేవారు లేకపోవడంతో గంటల తరబడి అందులోనే మునిగ తేలుతున్నారు. మద్యం, మాదక ద్రవ్యాల కంటే కూడా వీడియో గేమ్స్ ఎంతో ప్రమాదకరమైనవి. డ్రగ్స్, మద్యంతో శరీరక సమస్యలు తలెత్తుతాయి. అదే ఆన్లైన్ వీడియో గేమ్స్‌లో ఏకంగా మైండ్‌పై దాన్ని ప్రభావం పడుతుంది. పిల్లలు గేమ్స్‌కు అడిక్ట్ అవుతున్నారనితల్లిదండ్రులు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. పిల్లను గేమ్స్‌కు దూరంగా ఉంచాలి. అవసరమనుకుంటే మానసిక నిపుణుల వద్దకు తీసుకెళ్లికౌన్సిలింగ్ అందిచాలి. నిర్ణక్ష్యం చేస్తే వారి ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. లేదా డిప్రెషన్లో ఏదైనా ఘోరాలకు పాల్పడే అవకాశముంది.
-ఎన్.శంకర్‌రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు