Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ డివిజన్ లోని ప్రజలు అందరూ కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని శుక్రవారం ప్రచారం నిర్వహించారు. దానిలో భాగంగ వివేకానంద నగర్ కాలనీలోని ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకున్న సందర్బంగా కాలనీ వాసులకు 100% వ్యాక్సిన్ తీసుకున్న కాలనీ గా సర్టిఫికెట్ చేతన అందజేశారు. కార్యక్రమంలో స్థానికులు బీజేపీ సీనియర్ నాయకులు సంజరు పటేల్ రవీందర్ రెడ్డి హేమంత్ మూలే పాల్గొన్నారు. అనంతరం డివిజన్ లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి శుభ్రం చేయించారు. పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.