Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ చౌరస్తా నుండి నల్ల చెరువుకట్ట వరకు ఎన్నో ఏళ్ల్లుగా డ్రయినేజీ వ్యవస్థ చెడిపోయి పడుతున్న ఇబ్బందులను చూసి స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి డ్రయినేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపాలని ఉప్పల్ చౌరస్తా నుంచి నల్ల చెరువుకట్ట వరకు నూతన డ్రయినేజీ లైన్ వేయుటకు 3కోట్ల 20లక్షల రూపాయల నిధులు విడుదల చేయించారు. శనివారం ఉప్పల్ ప్రెస్‌క్లబ్ వద్ద ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి స్థానిక కార్పొరేటర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా నియోజకవర్గ అభివద్ధి ధ్యేయం గా ముందుకు వెళ్తున్నామని అన్నారు. డ్రయినేజీ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, అలాగే నాణ్యత ప్రమాణాలు పాటించాలని జీహెచ్‌ఎంసీి అధికారు లను, కాంట్రాక్టర్‌ను ఆదేశించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి, సీనియర్ నాయకులు టంటం వీరేష్, చింతల నరసింహారెడ్డి, వేముల వెంకట్‌రెడ్డి, నాయబు వెంకటేశ్వర్రావు, సోమసాని ప్రవీణ్ కుమార్, తుమ్మలపల్లి యాదగిరిరెడ్డి, అన్నే వెంకటేష్, సూరవి సత్యాపాల్ రెడ్డి, ఎండి జహంగీర్, పంగ మహేందర్ రెడ్డి, జీనత్ బేగం, జంగయ్య, చిలుగూరి శ్రీకాంత్, విశ్వనాధ్, సురేష్, మురళి, ప్రభాకర్, నాగుల సురేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.