Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
సంక్షేమ సంఘాలు కాలనీ అభివృద్ధికి వారధులని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని సుమిత్రనగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. సంక్షేమ సంఘం సభ్యులంతా ఐకమత్యంతో ఎటువంటి సమస్యలున్న తన దృష్టికి తీసుకవస్తే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు అశోక్ కోలార్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సభ్యులు శివరామ్కృష్ణ, వేముల కృష్ణ, సంపత్‌కుమార్, నవీన్‌కుమార్, షర్ఫీద్దిన్, సంతోష్‌కుమార్, బ్రహ్మనందం, రాజ, డేవిడ్, విజరురాజు, విజరు, ప్రవీణ్, వివేక్, కవినాత్ తదితరులు పాల్గొన్నారు.