Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
రహ్మత్‌నగర్ డివిజన్ వినాయక నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న ప్రజా సంఘాల ఆఫీసులో పట్నం సంఘం జూబ్లీహిల్స్ జోన్ నూతన కమిటీ ఎన్నిక ఆదివారం నిర్వహించారు. అధ్యక్షులుగా వై యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా సాయి శేషగిరిరావు, ఉపాధ్యక్షులుగా దేవేందర్, దశరథ్, జాయింట్ సెక్రటరీలుగా స్వర్ణ రాజ్, నరేష్, కార్తీక్, సభ్యులుగా కె. స్వామి, కె.వినోద్, రజిని కుమార్, ఏడుకొండలు, వీరస్వామి, యాదవ్, మాణిక్యమ్మ ఎన్నికయ్యారు. ఈసందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ సిటీ పట్నం సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.మారన్న మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా హైదరాబాద్ పట్టణ పౌర సమస్యలపై సంఘం నిరంతరం పనిచేస్తోందన్నారు. వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా అధికారులతో చర్చలు నిర్వహించి, ప్రజలందరికీ ఉచితంగా టీకా అందజేయడానికి కృషి చేసిందని తెలిపారు.