Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
అవినీతి అరాచకాలతో గత ఏడేండ్లుగా పాలిస్తున్న రాష్ట్ర సర్కార్కు తగిన గుణపాఠం ప్రజలే చెప్పుతారని, టీపీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి నియమితులైన తర్వాత టీఆర్ఎస్ పాలనకు అంతిమ ఘడియలు ప్రారంభమయ్యాయని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బంటు నరేష్ విమర్శించారు. రాష్ట్రయూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనరెడ్డి పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం సర్కిల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడం వారి ఆనైతికకు నిదర్శనమని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడంలో కేసీఆర్ సర్కార్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. దళితబంధు పథకాన్ని దళితులతోపాటు గిరిజనులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 2023లో కాంగ్రెస్ పూర్వ వైభవం రానుందని, కాంగ్రెస్ హయంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని జోష్యం తెలిపారు. అనంతరం మల్కాజ్గిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బండి శ్యామ్గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కంది శ్రావణ్ కుమార్రెడ్డి పాల్గొని సంఘీబావం తెలిపారు. అనంతరం నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. నాయకులు జేమ్స్, పున్నారెడ్డి, సంజీవరెడ్డి, రాము, లక్ష్మి, బండి శ్రీను, లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.