Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
తీన్మార్ మల్లన్నను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 36వ డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల మల్లేశ్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. శని వారం బాలాపూర్ తహసీల్దార్ జి.శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అవినీతి అక్రమాలను బయట పెడుతున్న క్యూ న్యూస్‌పై కక్షతో ఛానల్ అధినేత తీన్మార్ మల్లన్నను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ నెల 29 నుంచి హుజూరాబాద్ నుంచి చేపట్టిన పాదయాత్రను విచ్ఛిన్నం చేసే కోసం కుట్రలో భాగంగానే అరెస్టు చేశారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మల్లేష్, కే.రాజేష్, రమేష్, బాలకష్ణ, శ్రీకాంథ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.