Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
''ఆఫ్రికన్ అమెరికన్ రైటింగ్స్'' అనే అంశంపై ఓయూ సీఐపీ ఆధ్వర్యంలో, సీఐపీ సెమినార్ హాల్లో మూడు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశం డైరెక్టర్ డాక్టర్ కొండా నాగేశ్వర్ అధ్యక్షతన ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన ఓయూ రిజిస్టార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ. అంతర్జాతీయ సదస్సువల్ల మేధోపరమైన చర్చలకు అవకాశం కలుగుతుందన్నారు. వైవిధ్యభరితమైన సామాజిక సంబంధమైన అంశాలపై చర్చల ద్వారా మేధోపరమైన పరిపుష్టి ఏర్పడుతుందన్నారు. ఓఎస్డి ప్రొఫెసర్ బి.రెడ్యానాయక్ మాట్లాడుతూ... మంచి ఉపాధ్యాయులవల్ల విలువల నిర్మాణం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా రిజిస్ట్రార్, ఓఎస్డీలు ప్రొఫెసర్ ఎ. కరుణాకర్ కు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల కోరిక మేరకు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ ఎ.కరుణాకర్‌ను శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ. ప్రొఫెసర్ ఎ. కరుణాకర్ గత 30 ఏళ్లుగా నిరంతరాయంగా సేవలు అందించారని పేర్కొన్నారు. వందలాది మంది విద్యార్థులను యూనివర్సిటీ ఆచార్యులుగా, ఉపాధ్యాయులుగా, ప్రభుత్వ అధికారులుగా, ప్రజా సేవకులు గా తయారుచేయడంలో తన వంతు పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఓయూ ప్రొఫెసర్లు, మాజీ ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థి సంఘాల నాయకులు ప్రొఫెసర్ కరుణాకర్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఓయూ సీఐపీ డైరెక్టర్ డాక్టర్ కొండ నాగేశ్వర్, రుసా ప్రాజెక్ట్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ సౌందర్య, న్యాక్ సభ్యులు ప్రొఫెసర్ వైఎల్. శ్రీనివాస్, మాజీ ప్రొఫెసర్ యాదవరాజు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు జూలూరి గౌరీశంకర్, ఓయూ ప్రొఫెసర్ విజయ, డాక్టర్ అశోక్, డాక్టర్ క్రిస్టఫర్, డా.సవిన్ సౌడ, డాక్టర్ పరిమళ, సావిత్రి , అనిల్ కష్ణ రీసెర్చ్ స్కాలర్స్, ఉద్యోగులు పాల్గొన్నారు.