Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు కర్రె రాజేష్ హెచ్చరించారు. ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖమంత్రి చామకూర మాల్లారెడ్డి అవినీతి పరుడని, త్వరలోనే అన్ని ఆధారాలతో ఆయన బండారం బయట పెడతామని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇటీవల నిర్వహించిన సభలు విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌లు జీర్ణించుకోలేక, తమ చెంచా అయిన మల్లారెడ్డిని ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ రేవంత్‌రెడ్డిపై మంత్రి జోకర్ మల్లారెడ్డి, విసిరిన సవాల్ అర్థరహితంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి మండలాల్లోని కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మెన్లు, ఎంపీపీలతో ముడుపులు వసూలు చేసుకుంటూ ఏజెంట్‌గా మారారని ఆరోపించారు. మల్లారెడ్డి అవినీతిలో కేసీఆర్, కేటీఆర్‌లకు వాటాలు అందుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ పాలడుగు అమరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఫీర్జాదిగూడా అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ముత్యాలు యాదవ్, ఆంజనేయులు యాదవ్, రెహమాన్, ప్రదీప్‌రెడ్డి, వినోద్, శివ, తదితరులు పాల్గొన్నారు.