Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ 12వ వార్డు పరిధి, రావి నారాయణరెడ్డి కాలనీలో గల ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు సుమారు 90 మంది విద్యార్థులు ఉన్నారని, నాణ్యమైన విద్యను అందించే క్రమంలో ఈ పాఠశాల యందు తెలుగు మీడియంతో పాటుగా, ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టాలని హయత్నగర్ ఎంఈఓ హీర్యా నాయక్ని కలిసి మంగళవారం స్థానిక కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ హీర్యా నాయక్ స్పందిస్తూ ఈ అకాడమిక్ ఇయర్ నుండి ఇంగ్లీషు బోధన ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని, మీరిచ్చిన ప్రపోజల్స్ జిల్లా ఆఫీస్కు ఫార్వర్డ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మెన్ పాత్కూల పెంటయ్య, విద్యా కమిటీ సభ్యులు చిల్కూరి పుల్లయ్య, చింత వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.