Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు
ఎ. వినరు కుమార్
నవతెలంగాణ-గాంధీనగర్
సెప్టెంబర్ 10 నుంచి 19 వరకు నిర్వహించబోయే గణేష్ ఉత్సవాలకు పోలీసులు పూర్తిగా సహకరించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు ఎ. వినరు కుమార్ కోరారు. ఈమేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గణేష్ ఉత్సవాలకు ఘనంగా జరుపుకోవడానికి సహకారం అందించి, ఇబ్బందులు పెట్టకుండా ఉండాలని కోరారు. విద్యుత్ అధికారులు గణేష్ ఉత్సవాలకు ఎలాంటి చార్జెస్ వసూలు చేయరాదన్నారు. మండపం నిర్వాహకులకు ఎలాంటి సమస్య ఉన్నా, ఇబ్బందులు వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 7799819991కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ముషీరాబాద్ నియోజకవర్గం సభ్యులు పరిమల్, వెంకటేష్, మహేందర్ బాబు, ఉమేష్, శివాజీ, శక్తి సింగ్, రమేష్, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.