Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోనేది లేదని ఓయూ, మాదిగా జేఏసీ నాయకులు అన్నారు. ఈమేరకు మంగళవారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఫొటోకి చెప్పుల దండ వేసి నిరసన తెలియజేశారు. దళిత జాతి ముద్దుబిడ్డ మోత్కుపల్లి నర్సింహులు నికార్సయిన, మచ్చలేని నాయకుడని, అలాంటి వారిపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయించడం సరికాదని హెచ్చరించారు. దళితులను కించపరిచే విధంగా మాట్లాడే రేవంత్ రెడ్డికి దళిత, గిరిజన సభలు పెట్టే అర్హత లేదన్నారు. దళితులపై సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్న ఆయనకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాదిగ విద్యార్థి జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్చార్జ్ జోగు గణేష్, మీసాల మహేష్, ఓయూ జేఏసీ నాయకులు బోరెల్లి సురేష్, దేవరకొండ నరేష్, వేల్పుకొండ రామకృష్ణ, రేవంత్, రాజు, మల్లేష్, రాజేష్, శరత్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.