Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హోంమంత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ-ధూల్‌పేట్
అసఫ్ జాహీ పాలకులు అందించిన సేవలు, వారి లౌకిక భావాలను రాబోయే తరాలకు తెలియజేయాలని, అందుకోసం పుస్తకాలు, ఆడియో, వీడియో మాధ్యమాలను వినియోగించాలని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం పాతబస్తీలోని మీడియా ప్లస్ ఆడిటోరియంలో నిర్వహించిన 'ఏక్ షామ్ షౌకత్ ఉస్మానియ కే నామ్' సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాం పాలనలో కొనసాగిన ప్రధానమంత్రులు, ఇతర ఉన్నతాధికారులంతా హిందువులేనని, లౌకికత్వానికి, మతసామరస్య స్ఫూర్తికి ఇదొక నిదర్శనమన్నారు. షౌకతే ఉస్మానియా గ్రంథాన్ని ముద్రించిన ఉర్దూ అకాడమీ నిర్వాహకులకు మంత్రి ఈసందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ గ్రంథంలో 30మంది తమ రచనలు చేశారన్నారు. ఖాలిద్ షV్‌ా బాజ్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ అందరినీ ఎంతగానో ఆకట్టుకుందని, ఈ గ్రంథాన్ని డాక్యుమెంట్రీ రూపంలో ప్రదర్శించిన మీడియా ప్లస్ వారిని అభినందించారు. రెండుసార్లు ఉర్దూ అకాడమీ చైర్మెన్‌గా పనిచేసి ఎన్నో పుస్తకాలు ప్రచురించినందుకు ఎంతో సంతృప్తిగా ఉందని రహీముద్దీన్ అన్సారీ అన్నారు. సమావేశంలో నిజామ్ మనుమడు నవాబ్ మీర్ నజఫ్ అలీ ఖాన్, ఉర్దూ అకాడమీ సెక్రటరీ ముహమ్మద్ గౌస్, గవా పత్రిక ఎడిటర్ ఫాజిల్ హుసేన్ పర్వేజ్, గుల్ బోటే ఎడిటర్ ముంబై ఫారూక్ సయ్యద్, తామీరె మిల్లత్ అధ్యక్షులు జియావుద్దీన్ నయ్యర్, తస్నీమ్ జౌహర్, డాక్టర్ గౌసియా బేగమ్, డాక్టర్ నిషాత్ ఆలమ్, ప్రొఫెసర్ ఫజలుల్లా ముక్రమ్, అసత్ సనాయి, ప్రముఖ సాహితీ వేత్తలు, కవులు, రచయితలు పాల్గొన్నారు.