Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
బీజేపీ ముషీరాబాద్్ దళిత మోర్చా కన్వీనర్ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కేఎల్ సత్యనారాయణ రాజీనామా చేశారు. ఈసందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీజేపీలో 20 ఏండ్లుగా పనిచేస్తున్నానని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దళిత బహుజనులకు పార్టీలో స్థానం లేదని అందుకే రాజీనామా చేస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 7న తెలంగాణ బీఎస్పీ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఎస్పీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు రుద్రవరం సునీల్, నందకుమార్, మహమ్మద్ అబ్రార్, దినకర్, వినోద్ కుమార్, మహమ్మద్ అజీజ్, ఖలీల్, మంకల నందు తదితరులు పాల్గొన్నారు.