Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్రూరల్ :
ప్రతి గ్రామానికీ మిషన్ భగిరథ నీళ్లు అందేలా కృషిచేస్తామని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం కాచవాని సింగారం గ్రామ పరిధిలోని సుప్రభాత్, దివ్యానగర్ కాలనీల వాసులతో సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కాచవాని సింగారంలోని అన్ని కాలనీలకు దశల వారీగా భగీరథ నీళ్లు అందించేలా ప్లాన్ తయారు చేయాలని, అందుకోసం గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని చెప్పారు. జలమండలి డీఈ కార్తీక్ రెడ్డి, కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు పెరుమాండ్ల సుదర్శన్, రాజగోని మహేష్, కో ఆప్షన్ సభ్యులు మోటకట్ల భద్రారెడ్డి, కాలనీ పెద్దలు నల్ల నర్సింహ్మ రెడ్డి, నల్ల శ్రీధర్ రెడ్డి, జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.