Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ మున్సిపల్లో అవకతవకలపై ఆరా తీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కో - అప్షన్ సభ్యుడు ఎస్కే శౌకత్మియా గురువారం కలెక్టర్కు ఆర్టీఏ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ మున్సిపాలిటీిలో గత సంవత్సరం వరదలు వచ్చి వరద బాధితులకు ఘట్కేసర్ ఎస్బిఐ బ్యాంకు నుండి రూ.85 లక్షలు డ్రా చేశారని, ఇట్టి విషయంపై ఘట్కేసర్ మున్సిపల్ కార్యాలయంలో జులై 10న ఆర్.టీి.ఐ.కింద దరఖాస్తు పెట్టినట్టు తెలిపారు. ఆగష్టు 9న నాకు సమాచారం ఇచ్చారని, ఈ సమాచారం ప్రకారం 66 లక్షల 75వేలు మాత్రమే కమిషన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపాలిటీి ఆడ్మినిస్ట్రేషన్ నుండి ఈ సమాచారం వచ్చిందని, 620 మంది వరుద బాధితులకు 10వేల చొప్పున బాధితులకు పంపిణీి చేశారని సమాచారం ఇచ్చారు. కానీ ఘట్కేసర్ ఎస్ బిఐ నుండి డ్రా 85లక్షలు డ్రా చేసిన మున్సిపాలిటీి 62 లక్షలు వరద బాధితులకు పంపిణీి చేశారని రిమిట్ బ్యాంకు పేమేంటు రూ.4లక్షల 75 వేలు బ్యాంకులో రిమిట్ చేశారని, మిగతా రూ.18లక్షల 25 వేలు ఎక్కడ అని ప్రశ్నించారు. వెంటనే అధికారులు స్పదించి రూ.18 లక్షల 25వేల డబ్బు విషయంపై ఆరాతీసి ఘట్కేసర్ మున్సిపల్ కార్యాలయంపై తగు విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.