Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి సర్కిల్ ఆల్విన్ కాలనీలో అక్రమ నిర్మాణదారులకు అడ్డలేకుండా పోయిందని, రోజు రోజుకూ బహుళ అంతస్థుల భవనాలు పెరిగిపోతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఆల్విన్ కాలనీ ఫేస్ టు లో నాలా దాటగానే కుడివైపున నిర్మిస్తున్న ఓ భవనం, అట్లనే చక్రధర్ కాలనీ 110 ప్లాట్ నెంబర్లో అనుమతి ప్రకారం కాకుండా బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు. ఇటు స్థానికులకు సమస్య కల్పించడమేగాక తీసుకున్న అనుమతిని ఉల్లంఘించి అదనపు అంతస్తులు కడుతూ జీహెచ్ఎంసీ ఆదాయానికి బిల్డర్లు గండికొడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలనీలో అడ్డగోలు అక్రమ బిల్డింగులవల్ల డ్రయినేజీ సమస్యలు, మంచినీటి సమస్యలు అధికమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వాటిని అడ్డుకోవాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను కోరుతున్నారు. గతంలో టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా అక్రమ నిర్మాణాలు ఆగడం లేదని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని అడ్డగోలు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని కోరుతున్నారు. ఙ