Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
మూసాపేట్ డివిజన్ కబీర్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని మూసాపేట్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ గురువారం పర్యవేక్షించారు.18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. ప్రతి బస్తీ, కాలనీల్లో వాక్సినేషన్ కేంద్రాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తోందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యనారాయణ, అంబటి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు సత్యం, జోసెఫ్, మాజిద్, అంజిరెడ్డి, అబ్బులు, యాదగిరి, శేఖర్ ఏఈ శ్రీనివాస్, సి.ఓ మురళి తదితరులు పాల్గొన్నారు.