Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
మూసాపేట్ డివిజన్లోని బబ్బుగూడ ప్రభుత్వ పాఠశాలలో మాధ్యాహ్న భోజన విద్యార్థులకు అందించి మధ్యాహ్న భోజనాన్ని, ఇక్కడి పరిశుభ్రతను కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ పరిశీలించారు. ఇక్కడ నీటి సమస్య ఉందని తెలుసుకుని బోరుబావిని మరమ్మతు చేయించి ఉపయోగంలోకి తెచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. కొవిడ్ రూల్స్ పాటించాలని, రోజూ శానిటేషన్ చేయించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మానిక్, రవి యాదవ్, అభిరామ్ పాల్గొన్నారు.