Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాలని ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు నాగలక్ష్మి, అరుణజ్యోతి డిమాండ్ చేశారు. గురువారం ఐద్వా గ్రేటర్ హైద్రాబాద్ సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో కాచిగూడలోని కృష్ణానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు నాగలక్ష్మి, అరుణజ్యోతి, నాయకులు షాబానాబేగం, పి.విమల మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇష్టానురీతిగా గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందని అన్నారు. ఒకవైపు కరోనాతో ఉపాధి కరువై ప్రజలు అర్ధాకలితో అలమటిస్తుండగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు 15 రోజులలోనే రూ.50 పెంచిందని, 2014లో రూ.410 ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ.937లకు పెంచారని గుర్తుచేశారు. సామాన్యులు, పేద, మధ్యతరగతి ప్రజలు సిలిండర్ కొనలేక నానా అవస్థలు పడుతున్నారని, తిరిగి మహిళలు కట్టెల పొయ్యిలపై వంట చేసుకొనే పరిస్థితులకు నెట్టబడతారని అన్నారు. పెంచిన ధరలను ప్రభుత్వం తక్షణం తగ్గించకపోతే మహిళలే బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఉష, అన్నపూర్ణ, బాలనాగమ్మ తదితరులు పాల్గొన్నారు.