Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డిపై సీఎం కేసీఆర్ దయ చూపారా? ఆయనకు ఏదోఒక పదవి ఖాయమేనా? అంటే అవుననే సంకేతాలు సంకేతాలు అందుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు నుంచే టీఆర్ఎస్ అభివృద్ధి కోసం పని చేసిన దయాకర్ రెడ్డి 2014 నుంచి 2018 వరకు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కావడంలో వారు కీలక పాత్ర పోషించారు. అంతేగాక నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేశారు. 2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని ఆశించారు. అయితే పార్టీ మరో అభ్యర్థిని మేయర్‌గా ప్రకటించడంతో కినుక వహించిన దయాకర్‌రెడ్డి పార్టీ మారారు. ఆ తర్వాత కొద్ది సేపటికే మంత్రి మల్లారెడ్డి మంతనాలు జరిపి నేరుగా సీఎం కేసీఆర్‌తో మాట్లాడించడంతో త్వరలోనే మంచి స్థాయి కల్పించి ప్రాధాన్యత కల్పిస్తామని నాడు హమీ ఇచ్చారు. అయితే వెంటనే కరోనా, లాక్డౌన్ వంటి పరిణామాలు ఎదురయ్యాయి. రావాల్సిన పదవీ అయిపోయింది. కానీ ఈ నెల 2న డిల్లీలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా స్వయంగా సీఎంను కలిసిన సందర్భంగా దర్గాకు పూర్తి స్థాయిలో హమీ లభించినట్టు సమాచారం. ఏదో ఒక ముఖ్యమైన పదవి ఆయనకు త్వరలో వరించే అవకాశం ఉందని, అందుకు మంత్రి మల్లారెడ్డి సపోర్టు కూడా ఉందని స్థానిక టీఆర్ఎస్ శ్రేణులు, పలువురు నాయకులు బలంగా నమ్ముతున్నారు. ఏ పదవి వరించనుందో వేచి చూడాల్సిందే మరి !