Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పర్మినెంట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల వేతనాలు చెల్లించాలని జీహెచ్ఎంఈయూ ఆధ్వర్యంలో గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన గేట్ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంఈయూ అధ్యక్షులు ఉదరి గోపాల్ మాట్లాడుతూ శుక్రవారంలోగా వేతనాలు చెల్లించకపోతే సీవరేజ్ పనులు నిలిపేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులకు పీఆర్సీతోపాటు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీవరేజ్ కార్మికులకు రూ.17వేల వేతనం చెల్లించాలన్నారు. మృతి చెందిన సీవరేజ్ కార్మికులను ఆదుకోవాలని, తొలగించిన ఎస్ఎఫ్ఏ, ఈఎఫ్ఏ, పారిశుధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, పదవీవిరమణ పొందిన ఉద్యోగుల బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.